ETV Bharat / state

నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కవిత నామినేషన్​ - నిజామాబాద్​ మాజీ ఎంపీ కవిత

నిజామాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం మాజీ ఎంపీ కవిత నామినేషన్​ దాఖలు చేశారు. కవిత నామినేషన్​కు భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. జిల్లా కలెక్టరేట్​ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.

నిజామాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కవిత నామినేషన్​

author img

By

Published : Mar 18, 2020, 2:39 PM IST

నిజామాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కవిత నామినేషన్​

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం తెరాస తరఫున మాజీ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి కలెక్టరేట్​కు వచ్చిన కవిత.. జిల్లా పాలనాధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కవిత రావడం వల్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

అంతకుముందు నామినేషన్ కోసం వస్తున్న కవితకు అడుగడుగునా కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా టెక్రియాల్, గాంధారి చౌరస్తా, ఇందల్వాయి టోల్ ప్లాజా, డిచ్ పల్లి వద్ద కార్యకర్తలు కవితకు ఘన స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత.. మళ్లీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నామినేషన్ వేసేందుకు వస్తుండటం వల్ల పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.

మరోవైపు భాజపా తరఫున పోతాన్కర్ లక్ష్మీనారాయణ నామినేషన్ వేశారు. ఆయనకు అవకాశం కల్పించినందుకు పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: దారి పొడవునా కవితకు ఘన స్వాగతం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.