ETV Bharat / state

బ్లాక్‌ఫంగస్‌ను త్వరగా గుర్తిస్తే మేలు: డా.ప్రతాప్ కుమార్

కొవిడ్‌ చికిత్సలో స్టెరాయిడ్స్‌ అధిక మోతాదులో వాడటం.. మధుమేహం నియంత్రణలో లేకపోవడం బ్లాక్‌ఫంగస్‌కు దారి తీస్తుంది.. దీన్ని త్వరగా గుర్తిస్తే ఫలితం ఉంటుందన్నారు చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డా.ప్రతాప్ కుమార్. కొవిడ్‌ సందేహాల నివృత్తిలో భాగంగా ‘ఈనాడు- ఈటీవీ తెలంగాణ’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫోన్‌ఇన్‌లో ఆయన పాఠకులతో మాట్లాడారు. కొవిడ్‌ నుంచి కోలుకొన్న తర్వాత చాలా మందిలో గొంతు, తలనొప్పి సాధారణంగా మారాయి.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.. ఎప్పటికప్పుడు వైద్యుల సూచనలు తీసుకొంటూ ముందుకెళ్లాలన్నారు.

phone in programme
phone in programme
author img

By

Published : May 19, 2021, 10:33 PM IST

Updated : May 20, 2021, 11:52 AM IST

  • కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్‌ఫంగస్‌ వస్తుందంటున్నారు. దీన్ని గుర్తించడమెలా ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - రాజేష్‌, ధర్పల్లి

మ్యుకర్‌మైసోసిన్‌నే బ్లాక్‌ఫంగస్‌ అంటారు. మధుమేహం ఉండి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్న కొందరిలో ఇది కనిపిస్తోంది. నగరంలో నాలుగు రోజులుగా 30 కేసులు బయట పడ్డాయి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. ప్రతి పార్శ నొప్పిని బ్లాక్‌ఫంగస్‌గా భావించొద్దు. తలనొప్పి, ముక్కులో నుంచి నీరు, రక్తం కారడం, పళ్లు వదులు కావడం, కన్నుతో పాటు దవడలో నొప్పి, వాపు వస్తే వైద్యుణ్ని సంప్రదించాలి. ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా త్వరగా బయటపడొచ్చు. దీనిపై అందరూ అవగాహన పెంచుకోవాలి.

  • నెల క్రితం మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నా. కొద్ది రోజులుగా తిన్న వెంటనే గొంతులో నొప్పి వస్తోంది. వారం నుంచి చెవులు మూసుకుపోయినట్లు అనిపిస్తోంది. వ్యాక్సిన్‌ వల్ల ఇలా జరుగుతోందా? - మధు, నిజామాబాద్‌

ఇది సాధారణంగా వస్తుంది. వ్యాక్సిన్‌ వల్ల రెండ్రోజులు మాత్రమే జ్వరం వస్తుంది. ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దు. గొంతు నొప్పి తగ్గడానికి రోజూ ఉప్పు నీటిని పుక్కిలించాలి. జలుబు, ఇతర కారణాలతోనూ చెవులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు.

  • నా వయసు 80 ఏళ్లు. ఎనిమిది నెలల కిందట కరోనా వచ్చి కోలుకున్నా. 20 రోజుల క్రితం కొవిషీల్డ్‌ తీసుకున్నా. వారం నుంచి కళ్లు ఎర్రగా అవుతున్నాయి. గొంతులో నొప్పిగా ఉంటోంది. ఒక చెవి సరిగా వినిపించడం లేదు. ? - బాపురావు, కిసాన్‌నగర్‌

వయసుతో పాటు కొందరిలో ఇబ్బందులు వస్తుంటాయి. ఒకసారి వైద్యుణ్ని సంప్రదించి చికిత్స తీసుకుంటే బాగుంటుంది.

  • కరోనా మొదటి దశలో లక్షణాలు కనిపిస్తే మందులు వాడాను. నాకు సైనస్‌ ఉంది. నాలుగైదు రోజులుగా తలనొప్పి వస్తోంది? - సాయిలు, నిజామాబాద్‌.

సాధారణంగా అందరిలో ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. కంగారు పడల్సిన అవసరం లేదు.

  • నెల కిందట కరోనా నుంచి కోలుకున్నా. ఓ వైపు తలనొప్పి వస్తోంది. గతంలో మైగ్రేన్‌ ఉండేది. మళ్లీ తిరగబెట్టిందా? - లక్ష్మణ్‌ గౌడ్‌, నిజామాబాద్‌

కరోనా నుంచి కోలుకున్న వారిలో ఇతర రుగ్మతలు బయటపడుతున్నాయి. కొందరిలో అప్పటికే తగ్గిన రోగాలు మళ్లీ తిరగబెడుతున్నాయి. గతంలో మైగ్రేన్‌ ఉండటం వల్ల ఇప్పుడు తలనొప్పి వచ్చిందని కచ్చితంగా చెప్పలేం. సైనసైటిస్‌ ఒక కారణం కావచ్చు.

  • కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత తలనొప్పి, గొంతులో మంటగా ఉంటోంది. ఏం చేయాలి? - గంగాప్రసాద్‌, బోధన్‌, రాంచందర్‌, మామిడిపల్లి, పద్మావతి, నిజామాబాద్‌

మానసిక ఒత్తిడి, విపరీత ఆలోచనలు, నిద్రలేమి వల్ల తలనొప్పి వస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒత్తిడి లేకుండా జీవించాలి. ఉప్పునీళ్లు పుక్కిలించండి అప్పటికీ గొంతు నొప్పి తగ్గకుంటే వైద్యుణ్ని సంప్రదించాలి..

ఇదీ చూడండి: గాంధీలో కేసీఆర్​... రోగులకు ధైర్యం చెప్పిన సీఎం

Last Updated : May 20, 2021, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.