నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని యానంపల్లి తండాలో విషాదం నెలకొంది. ధనావత్ శ్రీనివాస్, యమున దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె విష్ణుప్రియను పాము కాటేసింది. రాత్రి పాప ఏడుస్తుంటే మేల్కొన్న ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది.
తాండాలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విష్ణుప్రియ రాత్రి వరకు ఆటపాటలతో గడిపి పాముకాటుకు గురవ్వడం అందరిని కలిచివేసింది. తండావాసులను శోకసంద్రంలో ముంచింది.
ఇదీ చూడండి: గోదావరిలోకి చేరుతున్న వరద నీరు... తెగిపోయిన డ్యాం