నెల రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయిలోని అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ భవనాలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలలు.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాను.. హరిత, ఆరోగ్య, పారిశుద్ధ్య జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులను హెచ్చరించారు.
ఇవీచూడండి: అసోంలో రెండు బస్సులు ఢీ.. 9మంది మృతి