ETV Bharat / state

కిరాణా దుకాణంలో.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనిఖీలు

ఆహార కల్తీ నిరోధకశాఖ ఆధ్వర్యంలో.. నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలంలోని ఓ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. నాసిరకం పదార్ధాలుగా గుర్తించిన.. పలు శాంపిల్స్​ను సేకరించి ల్యాబ్​కు పంపించారు.

author img

By

Published : Mar 19, 2021, 9:17 AM IST

District Food Safety Officer inspection in a grocery store in dichpalli
కిరాణా దుకాణంలో.. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనిఖీ

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం ధర్మారం గ్రామంలో.. ఆహార కల్తీ నిరోధకశాఖ బృందం ఆకస్మిక పర్యటన చేసింది. ఎస్సీ కాలనీలోని సంతోశ్ కిరాణా దుకాణంలో కల్తీ వస్తువులు అమ్ముతున్నట్లు అందిన ఫిర్యాదుతో.. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తారా చంద్​నాయక్.. షాపులో తనిఖీలు జరిపారు.

కల్తీ అయినట్లు ప్రాథమికంగా గుర్తించిన.. రవ్వ, పప్పులను సీజ్ చేసి ల్యాబ్​కు పంపిస్తున్నట్లు తారా చంద్​నాయక్ తెలిపారు. రిపోర్టుల ఆధారంగా.. దుకాణం యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.