నిజామాబాద్ జిల్లా దత్తపూర్ గ్రామంలో ఎస్సీలపై దాడులకు పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆ గ్రామ దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆ గ్రామంలో సుమారు 1976 నుంచి దళితులు భూములను సాగు చేసుకుంటుండగా... వారిపై అగ్రవర్ణ కులస్థులు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఉపాధి లేక ఎస్సీలు ఇతర ప్రాంతాలకు వెళ్తే... ఆ భూములను కబ్జా చేసి దొంగ పట్టాలు సృష్టించారని ఆరోపించారు. మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీల ఆధీనంలో ఉన్న భూములకు వెంటనే పట్టాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పెట్రో బాదుడు నుంచి త్వరలోనే ఊరట!