ETV Bharat / state

DS Joining in Congress: డీఎస్​ సొంతగూటికి చేరేందుకు ముహూర్తం ఖరారు..! - congrss joinings

DS Joining in Congress: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డి.శ్రీనివాస్.. మళ్లీ తన సొంతగూటికి చేరుతున్నారు. ఈ నెల 24న పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్నారని సమాచారం.

Darmapuri Srinivas Joining in Congress on January 24th

author img

By

Published : Jan 16, 2022, 5:10 PM IST

DS Joining in Congress: రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నారు. ఈ నెల 24న సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరే అవకాశం కనిపిస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా కాంగ్రెస్​లో కీలక పాత్ర పోషించిన డీఎస్.. 2015లో తెరాసలో చేరారు. తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన డీఎస్.. కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్​లో చేరాలని డీఎస్ నిర్ణయించుకున్నారు.

డీఎస్​ రాక వెనుక అసలు కారణం ఆయన పెద్ద కుమారుడు సంజయ్ అంటున్నాయి పార్టీ వర్గాలు. సంజయ్ సైతం రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టగానే పార్టీలో చేరేందుకు సంసిద్ధతను తెలిపారు. ఇప్పుడు సంజయ్‌కు రాజకీయ భవిష్యత్‌ను అందించేందుకు డీఎస్​ తిరిగి పాత గూటికి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎంపీ అర్వింద్ సైతం తన తండ్రిని భాజపాలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఒకవేళ డీఎస్​ భాజపాలోకి వస్తే స్వాగతిస్తామని ఓ ప్రకటనలో చెప్పారు.

జిల్లా రాజకీయాలపై తీవ్రప్రభావం

మొత్తం మీద డీఎస్​ తిరిగి కాంగ్రెస్‌లోకి తిరిగి రావడం ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కొందరు మాత్రం పదవుల కోసమే ఆయన పార్టీలు మారుతున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ను విడిచి తెరాసకు వెళ్లారని.. ఇప్పుడు పదవీకాలం అయిపోగానే మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.