ETV Bharat / state

Crop Damage : వానలు ఆగవాయే.. కౌలు రైతుకు దిగులు తప్పదాయే

author img

By

Published : May 6, 2023, 8:02 AM IST

Updated : May 6, 2023, 9:46 AM IST

Crop Damage in Nizamabad: మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా తయారైంది కౌలు రైతుల పరిస్థితి. ఇప్పటికే తెగుళ్లతో సగం నష్టపోయిన అన్నదాత.. ప్రస్తుతం ఉన్న పంట చేతికి వస్తుందని భావిస్తున్న క్రమంలో అకాల వర్షాలతో నిండా మునిగారు. ఆరుగాలం కష్టం చేసిన కొద్దిపాటి పంట వర్షార్పణం కావడంతో.. అప్పులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస దిగుబడి రాకపోవడంతో అప్పులు కట్టలేక.. కౌలు చెల్లించే పరిస్థితి లేక ఆందోళన చెందుతున్నారు.

Nizamabad district
Nizamabad district
వర్షాలు ఆగవాయే.. కౌలు రైతుకు దిగాలు తప్పదాయే

Crop Damage in Nizamabad : అకాల వర్షాలతో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన అన్నదాతలు.. పంటచేతికందే సమయంలో కురిసిన వడగండ్ల వానలతో తీవ్రంగా నష్టపోయారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భూమిలేని కర్షకులు చాలామంది కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. ఎకరాకు ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల ధాన్యం లేదా.. ఎకరాకు రూ.20,000 వరకు కౌలు చెల్లిస్తున్నారు.

Nizamabad Tenant Farmers Problems :ఈ సీజన్‌లో కామారెడ్డి జిల్లాలో 3,500 మంది కౌలు రైతులు.. దాదాపు 40,000 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 4,500 మంది కౌలు రైతులు లక్ష ఎకరాల్లో పంటలు సాగు చేశారు. రెక్కల కష్టంతో సాగుచేసి చివరకు.. వరి కోసి ధాన్యాన్ని కేంద్రాలకు తరలించే వరకు ఎకరాకు రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ఖర్చు చేశారు. కొన్నిచోట్ల కోతకు వచ్చిన వరి వర్షాలకు దెబ్బతినడంతో.. వారు తీవ్రంగా నష్టపోయారు.

కౌలు రైతులను.. రైతులుగా గుర్తించకపోవడంతో: వరి కోసిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అయితే వర్షాలకి ధాన్యం తడిసిపోయి.. మొలకలు వస్తుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు తిరిగివచ్చే పరిస్థితులు లేవని దిగాలు చెందుతున్నారు. రాష్ట్రంలో కౌలు రైతులను.. రైతులుగా గుర్తించకపోవడంతో పంటలు దెబ్బతిన్న సమయంలో వారిని పట్టించుకునే వారు కరవయ్యారు. పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు భూయజమాని ఖాతాలోకి వెలుతోంది.

పంట దెబ్బతిన్నప్పుడు ప్రభుత్వం సాయం అందిస్తే.. కౌలు రైతుకు పరిహారం అందే అవకాశం లేదు. వీరిని ప్రభుత్వాలు గుర్తించకపోవడంతో ఏ మేలు జరగట్లేదు. భూములు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి.. ప్రాణాలు కోల్పో యిన పరిస్థితుల్లోనూ బీమా అందడం లేదు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. వర్షానికి సాధారణ కర్షకులు పంట కోల్పోతే.. కౌలు రైతులు మాత్రం కౌలుతోపాటు పంటను నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఎకరాకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు కౌలు చెల్లిస్తున్నాం. ఈ అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయాం. పెట్టుబడులు బాగా పెరిగాయి. దిగుబడి తగ్గిపోయింది. ఇప్పుడు అకాల వర్షాల వల్ల పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. భూయజమానులు కౌలు చెల్లించాలని అంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాం." -కౌలు రైతులు

ఇవీ చదవండి: Liquor Prices Reduced in Telangana : మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన మద్యం ధరలు

దొంగల భరతం పట్టిన ఎంపీ.. యాక్షన్ హీరోలా ఛేజింగ్.. తుపాకీ గురిపెట్టినా తగ్గేదేలే!

Last Updated : May 6, 2023, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.