ETV Bharat / state

'గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలపై చర్యలు తీసుకోవాలి' - ఆన్​లైన్​లో సీపీఐ సమావేశం తాజావార్తలు

గ్రామాభివృద్ధి కమిటీల దుశ్చర్యలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ సీపీఎం నాయకులు డిమాండ్​ చేశారు. అలాగే కరోనా వ్యాధిని ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాలని కోరారు.

CPI Online meeting with Activists in Nizamabad district
గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలపై చర్యలు తీసుకోవాలి
author img

By

Published : Jul 11, 2020, 10:43 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో కార్యకర్తల విస్తృత సమావేశం ఆన్​లైన్​లో నిర్వహించారు. జిల్లాలో రోజురోజుకు గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు పెరుగుతున్నాయని జిల్లా కార్యదర్శి రమేశ్​ బాబు ఆరోపించారు. తమ మాట వినని వారిపైన సామాజిక బహిష్కరణలు, జరిమానాలు విధిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలపైన వేధింపులకు పాల్పడుతున్నారని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్​ చేశారు.

అదేవిధంగా జిల్లాలో పెరుగుతున్న కరోనా వ్యాధిని అరికట్టడానికి విస్తృతంగా పరీక్షలు చేయాలని సూచించారు. వ్యాధిని ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పేద కుటుంబాలకు ఆరు నెలల పాటు నెలకు రూ.7,500 కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందించాలని తెలిపారు. సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.