ETV Bharat / state

'కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలి'

author img

By

Published : Jul 16, 2020, 3:37 PM IST

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని సీపీఎం నిజామాబాద్​ జిల్లా కార్యదర్శి రమేశ్​బాబు డిమాండ్​ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగాన్ని, ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటాన్ని నిరసిస్తూ జిల్లా ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు.

cpi leaders protest at nizamabad
'కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చాలి'

కరోనా వైరస్‌ నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఘోరంగా విఫలమయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్లక్ష్యం ఫలితంగానే కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్​ బాబు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా సీపీఎం ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కరోనా నివారణకు అధిక మొత్తంలో నిధులు విడుదల చేయాలని రమేశ్​బాబు డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలు ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు కరోనా చికిత్స అందించాలని సూచించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా పడకలు లేక ప్రజలు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సత్యాగ్రహంలో సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.