ప్రతిపౌరుడు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలని సీపీ కార్తికేయ అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని 1వ టౌన్ పరిధిలోని గౌతమి డిగ్రీ కళాశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై సీపీ అవగాహన కల్పించారు. 2019లో జిల్లాలోనే 281 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్నారు. ప్రతిపౌరుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు.
వాహనాలు నడిపే సమయంలో ఏకాగ్రతతో నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా పరిమిత వేగంతో గమ్యస్థానాలు చేరుకునే విధంగా ప్రయాణించాలని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి : స్టూడెంట్ నుంచి లంచం..అడ్డంగా దొరికిన ప్రిన్సిపాల్