నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని అమ్దాపూర్ క్వారంటైన్ కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని కొవిడ్ వ్యాధిగ్రస్తులు ఆందోళన చేపట్టారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి బోధన్ జిల్లా ఆసుపత్రి నుంచి అమ్దాపూర్కు ఆకస్మికంగా తరలించారని వాపోయారు. గదులు దుమ్ముతో నిండిపోయి ఉన్నాయని పేర్కొన్నారు. బాత్ రూమ్లు శుభ్రం చేసే నాథుడే కరువయ్యారన్నారు.
గదుల్లో ఫ్యాన్లు లేక పోవటంతో రాత్రి దోమలతో పోరాటం చేస్తూ నిద్రహారాలు లేక బిక్కుబిక్కు మంటు భయంతో కాలం వెళ్లదీస్తున్నామని పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు ఇచ్చే మందులు మధ్యాహ్నం 12:30కి ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మెడిసిన్ ఎందుకు సమయానికి ఇవ్వటంలేదో తెలపాలంటూ క్వారంటైన్ కేంద్రం ముందు నిరసన తెలిపారు. స్థానిక తహశీల్దార్ గఫార్ మియా వచ్చి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ప్లవనామ సంవత్సరంలో కొవిడ్ అంతం కావాలి: గవర్నర్