ETV Bharat / state

ఇందూరు కాలనీల్లో కరోనా జాడలు - corona cases in nizamabad

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కాలనీల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రోజుకు కనీసం నాలుగు నుంచి ఎనిమిది కేసులు రావడంతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

corona cases increasing in nizamabad
ఇందూరు కాలనీల్లో కరోనా జాడలు
author img

By

Published : Aug 8, 2020, 2:22 PM IST

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన కాలనీల్లో రోజూ నాలుగు నుంచి ఎనిమిది వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కొత్తగా 89 మంది కొవిడ్‌ బారినపడ్డారు. ఎడపల్లికి చెందిన 50 ఏళ్ల మహిళ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గంజ్‌ ప్రాంతంలో ఎనిమిది మందికి సోకడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు శుక్రవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కంటైన్‌మెంట్‌ జోన్‌గా పరిగణించాలని అంటున్నారు.

వేల్పూర్‌: రామన్నపేట్‌కు చెందిన దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది

నందిపేట్‌: తొండాకూర్‌కు చెందిన అన్నదమ్ములకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డొంకేశ్వర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు గంగారెడ్డి తెలిపారు.

నవీపేట: నవీపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఆస్పతి పర్యవేక్షకుడు దేవేందర్‌ తెలిపారు.

సిరికొండ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆరుగురికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మండల వైద్యాధికారి మోహన్‌ తెలిపారు. ఇందులో పోలీసు ఠాణా ఉన్నతాధికారి ఉన్నట్లు పేర్కొన్నారు.

నిజామాబాద్‌ గ్రామీణం: ముదక్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ముబారక్‌నగర్‌, ఆర్యనగర్‌, బోర్గాం(పి)లో ఒక్కో కేసు వచ్చినట్లు మండల ఆరోగ్యాధికారి నవీన్‌ శుక్రవారం తెలిపారు.

వన్నెల్‌(బి)(బాల్కొండ): బాల్కొండ మండలం వన్నెల్‌(బి)లో ఒకే ఇంట్లో తల్లి, కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైందని వైద్య సిబ్బంది తెలిపారు.

వర్ని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడుగురికి కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారి వెంకన్న తెలిపారు. చందూర్‌, సత్యనారాయణపురం గ్రామాలకు చెందిన వ్యక్తులకు వైరస్‌ సోకిందన్నారు.

బోధన్‌ గ్రామీణం: సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శుక్రవారం నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షల్లో ఆరుగురికి నెగెటివ్‌ రాగా ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు పీహెచ్‌సీ వైద్యురాలు రేఖ తెలిపారు.

ఆర్మూర్‌ డివిజన్‌లో 21 మందికి

ఆర్మూర్‌ డివిజన్‌లో శుక్రవారం మరో 21 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. డివిజన్‌లోని వివిధ ప్రభుత్వాసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో 77 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తే 19 మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. ఆర్మూర్‌ పట్టణంలో అయిదుగురికి, మండలంలోని ఆలూరులో ఒకరికి, ఆరోగ్య కేంద్రాల పరిధిలో డొంకేశ్వర్‌లో ఇద్దరికి, మెండోరాలో ఒకరికి, పోచంపాడ్‌లో ఇద్దరికి, వేల్పూర్‌లో ఇద్దరికి, బాల్కొండలో ఇద్దరికి, మోర్తాడ్‌లో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇవిగాక నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్న మరో ఇద్దరికి కొవిడ్‌ నిర్ధారణైంది.

వైద్యులపై దాడికి యత్నం: కేసు నమోదు

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై దాడికి యత్నించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపారు. ఎడపల్లి మండలానికి చెందిన 50 ఏళ్ల మహిళ కరోనాతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందడంతో ఆమె కుటుంబీకులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. అద్దాలు ధ్వంసం చేయడంతోపాటు వైద్యులు, సిబ్బందిపై దాడికి యత్నించినట్లు సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో వివరించారు.

కొవిడ్‌తో ఒకరి మృతి

బోధన్‌ పట్టణంలో కొవిడ్‌తో ఒక వ్యక్తి(63) మృతి చెందారు. గత నెల 31న ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారని వైద్యవర్గాలు తెలిపాయి. పట్టణంలో ఇప్పటి వరకు 133 మందికి పాజిటివ్‌ రాగా ఏడు మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 76 మంది గృహ నిర్బంధంలో, 10 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డివిజన్‌లో 293 కేసులు నమోదయ్యాయి.

ఇవీ చూడండి: తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు, 14 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.