ETV Bharat / state

CORONA FREE VILLAGE: ఆంక్షలు పెట్టుకుని.. వైరస్​ను అడ్డుకుని..! - telangana latest news

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తుంటే.. ఆ గ్రామంలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసూ వెలుగుచూడలేదు. ఒక్కరూ వైరస్​ బారినపడలేదు. కొవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా.. వైరస్​ను మాత్రం దరిచేరనీయలేదు. ఊరంతా ఏకతాటిపై నిలబడిన ఆ గ్రామం విశేషాలు మీరూ తెలుసుకోండి.

ఆంక్షలు పెట్టుకుని.. వైరస్​ను అడ్డుకుని..!

author img

By

Published : Jun 15, 2021, 11:35 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు.. దేశాలకు దేశాలనే గడగడలాడించింది. కొన్ని రాష్ట్రాల్లో మృత్యుకుహురాలను పేర్చింది. దేశంలోనూ అనేక రాష్ట్రాల్లో మహమ్మారి విధ్వంసం సృష్టించింది. మహారాష్ట్రలో పరిస్థితి చేదాటి పోయే స్థితికి వచ్చింది. తెలంగాణలోనూ కేసులు పెరిగాయి. ఈసారి పట్టణాల కంటే పల్లెల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోనూ అధికంగా కేసులు వెలుగు చూశాయి. అయితే కొవిడ్​ ఉద్ధృతి అధికంగా ఉన్న మహారాష్ట్రను ఆనుకొని కేవలం మూడు కి.మీ.ల దూరంలోనే ఉన్నా.. బోధన్ మండలం బిక్​నెల్లి గ్రామం మాత్రం కరోనాను దరిచేరనీయలేదు. అందరూ కలసి కట్టుగా నిలబడి వైరస్​ను గ్రామంలోకి రాకుండా నిలువరించారు. కరోనా రహిత గ్రామంగా నిలుపుకున్నారు.

మహారాష్ట్ర సరిహద్దులో ఉండే ఈ గ్రామంలో 500 జనాభా ఉంది. కరోనా ప్రారంభం నుంచి గ్రామంలో ప్రజలంతా కలిసి చర్చించుకుని కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నారు. రెండో దశలోనూ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తూ.. కొవిడ్​ను కట్టడి చేశారు. పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక జాగ్రత్త కనబర్చారు. గ్రామస్థులెవరూ ఊరు దాటి వెళ్లకుండా.. గ్రామంలోకి ఇతరులను రానీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో కరోనా రక్కసి ఆ గ్రామంలోకి అడుగు పెట్టలేకపోయింది. ఊరంతా ఏకతాటిపై నిలబడి గ్రామాన్ని కరోనా రహితంగా నిలుపుకోవడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మా పల్లెలో ఇప్పటి వరకు ఒక్క కేసూ నమోదు కాకపోవడం పట్ల మాకు సంతోషంగా ఉంది. దీని కోసం మేమందరం కరోనా నిబంధనలను కఠినంగా పాటించాం. ప్రతి ఒక్కరం మాస్కు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం చేశాం. బయటి ఊళ్లకు వెళ్లకుండా.. బయటి వారిని ఊళ్లోకి రాకుండా చూసుకుని వైరస్​ను అడ్డుకున్నాం.-గ్రామస్థుడు

ఇదీ చూడండి: ఊరంతా చిందులెయ్యాలా .. కరోనాను పక్కనపెట్టాలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.