నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించారు. ప్రజలు బయట తిరగకుండా అవగాహన కల్పిస్తున్నారు. మార్కెట్లు, కిరాణా దుకాణాలు, ఇతర ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ వేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ గ్రామ స్థాయిలో కరోనా కమిటీ వేసుకొని ప్రజలు బయటకు రాకుండా ప్రత్యోక చర్యలు తీసుకుటున్నామన్నారు.
జిల్లా యంత్రాంగం కరోనా విషయంలో ప్రజలకు అను నిత్యం అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఇంటింటికీ కరోనా వ్యాధిపై అవగాహన కల్పించేలా స్టిక్కర్లు అంటిస్తున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని నిత్యం పర్యవేక్షిస్తున్నామని, తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉపాధి హామీ పథకం పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ గ్రామ స్థాయిలో కరోనా కమిటీ వేసుకొని ప్రజలు బయటకు రాకుండా చూసుకుంటున్నామని ఆమె తెలిపారు.