ETV Bharat / state

కరోనా పంజా: పెంచిన టెస్టుల సంఖ్య... పెరుగుతున్న కేసులు

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిజామాబాద్​ జిల్లాలో ర్యాపిడ్‌ పరీక్షల సంఖ్య పెంచగా.. పాజిటివ్​ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. కేసుల సంఖ్య పెరగటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

corona cases increasing in nizamabad
corona cases increasing in nizamabad
author img

By

Published : Aug 26, 2020, 10:18 AM IST

నిజామాబాద్‌ జిల్లాలో ర్యాపిడ్‌ పరీక్షల సంఖ్య పెరిగింది. కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 15 ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం 1,101 మందికి ర్యాపిడ్‌ కిట్లతో పరీక్షలు చేయగా 185 మందికి పాజిటివ్‌గా తేలిందని డిప్యూటీ డీఎంహెచ్‌వో అంజన తెలిపారు.

ముదక్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో 42, సీతారాంనగర్‌ యూపీహెచ్‌సీ పరిధిలో 23, వినాయక్‌నగర్‌లో 18, ధర్పల్లి సీహెచ్‌సీ పరిధిలో 14 మంది వైరస్‌ బారిన పడ్డారు. మిగిలిన 11 ఆరోగ్య కేంద్రాల్లో 3 నుంచి 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

బోధన్‌ డివిజన్‌ పరిధిలో మంగళవారం కొత్తగా 70 కరోనా కేసులు నమోదయ్యాయి. డివిజన్‌ వ్యాప్తంగా 831 నమూనాలు సేకరించి పరీక్షించారు. అందులో రాకాసిపేట్‌ యూపీహెచ్‌సీలో 13, బోధన్‌ ఆస్పత్రిలో 11 అత్యధిక కేసులు నమోదయ్యాయి.

బోధన్‌ పట్టణంలోని యూపీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహించిన పరీక్షల్లో 30 మందికి కరోనా నిర్ధారణ అయింది. పీహెచ్‌సీలు, ఆస్పత్రి, సంచార వాహనాల్లో మొత్తం 238 మందికి పరీక్షలు నిర్వహించారు.

భీమ్‌గల్ మండలంలో 74 మందికి పరీక్షలు నిర్వహించగా.. పట్టణంలో నలుగురికి, బడాభీమ్‌గల్‌లో, జాగిర్యాల్‌లో ఇద్దరికి, పిప్రిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి అజయ్‌పవార్‌ తెలిపారు.

కమ్మర్‌పల్లి, చౌట్‌పల్లి పీహెచ్‌సీల పరిధిలోని గ్రామాల్లో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. కమ్మర్‌పల్లిలో 15, ఏర్గట్లలో 5, దొన్కల్‌లో 5, హాసాకొత్తూర్‌లో 5, చౌట్‌పల్లిలో 1, బషీరాబాద్‌లో 1, సుంకెటలో 3 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు అంబిక, రతన్‌సింగ్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.