మరోసారి విస్తరిస్తున్న కరోనా మహమ్మారి - telangana varthalu
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరోసారి కొవిడ్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్నిచోట్ల స్వచ్ఛంద లాక్‌డౌన్ కూడా అమలు చేస్తున్నారు.
మరోసారి విస్తరిస్తున్న కరోనా మహమ్మారి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో కొన్నిచోట్ల స్వచ్ఛంద లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రస్థాయిలో ఉండటంతో సరిహద్దు గ్రామ ప్రజలు భయపడుతున్నారు. విద్యాసంస్థల్లోనూ విద్యార్థులు కొవిడ్ బారిన పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ వృద్ధుడు కరోనా చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. మోపాల్‌లో పాజిటివ్ కేసులు 20వరకు ఉండటంతో స్వచ్ఛంద లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో కరోనా కలకలం