రాష్ట్రంలో చేపట్ట బోయే నిర్బంధ వ్యవసాయ పద్ధతిని సీఎం కేసీఆర్ వెంటనే మానుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో సమావేశమైన కాంగ్రెస్ నాయకులు... సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.
రైతులు తరతరాల నుంచి సాగుచేస్తున్న పంటల కొనుగోలు తప్పించుకోవడానికి సీఎం కుట్ర పన్నుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులతోనే పంటలు సాగుతున్నాయే తప్ప... తెరాస ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులతో ఒరిగింది ఏమీ లేదని నాయకులు ఆరోపించారు.