ETV Bharat / state

'నూతన వ్యవసాయ విధానంపై సర్కారు పునరాలోచన చేయాలి'

కేవలం రైతుబంధును చెల్లించకుండా ఉండేందుకే ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానాన్ని ప్రకటించింది నిజామాబాద్​ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఈ విధానంపై పునరాలోచన చేయాలని సూచించారు.

congress leader manala mohanreddy spoke new agriculture policy in telangana
'నూతన వ్యవసాయ విధానంపై సర్కారు పునరాలోచన చేయాలి'
author img

By

Published : May 26, 2020, 7:19 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్​లో ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ విధానంపై డీసీసీ​ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకొని దళారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ విధానం ఉందని మానాల ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో రైతు పండిస్తున్న దొడ్డురకం వడ్లకు 1835 రూపాయలు కాగా... తక్కువ దిగుబడి, తక్కువ రేటు వచ్చే సన్న రకాన్ని పండించమని చెప్పి రైతును మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేవలం రైతుబంధు చెల్లించకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని మానాల మోహన్​రెడ్డి ఆరోపించారు.

వర్షాధారిత పంట అయిన మొక్కజొన్నను కాదని పత్తి పండించమని చెప్పడం ఈ జిల్లా రైతాంగం పట్ల గాని ,భూముల పైన గాని అవగాహన లేని జిల్లా ఎమ్మెల్యేలు రైతులను కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటను కాదని వాణిజ్య పంటలైన పత్తిని ప్రోత్సహించడం ఎవరి మెప్పు కోసమో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానంపై పునరాలోచన చేయాలని లేనియెడల సర్కారుపై పోరాటం చేసి రైతులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, జిల్లా ఎన్​ఎస్​యూఐ అధ్యక్షులు వేణు రాజ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రైతులు ప్రాధాన్య పంటలు సాగు చేయాలి: మంత్రి హరీశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.