జిల్లాలో వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లను పాలనాధికారి నారాయణ రెడ్డి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. జిల్లాకేంద్రానికి ఇప్పటికే 302 మెయిల్స్ వచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం సదుపాయాలను పరిశీలించారు. కొవిడ్ ఫిర్యాదుల కోసం ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు.
వ్యాక్సిన్ ప్రక్రియ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి కేంద్రంలో మొదటిరోజు 30 మందికి టీకా వేయనున్నామని స్పష్టం చేశారు. ఈనెల 18వ తేదీ నుండి 42 ప్రభుత్వ ఆస్పత్రులు, 4 ప్రైవేటు ఆస్పత్రులలో టీకా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదట దాదాపు 15 వేల మంది వైద్య సిబ్బందికి ఈ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రజలు కింది నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు.
- నిజామాబాద్ 8309219718
- బోధన్ 08467 222001
- ఆర్మూర్ 08463 295050