వివిధ రకాల వాహనాలను ఒకే చోట చేర్చి.. వాహన ప్రియులకు అందుబాటులోకి తీసుకురావడం మంచి ప్రయత్నమని నిజామాబాద్ జిల్లా పాలనాధికారి ఎం.రామ్మోహన్ రావు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ మైదానంలో ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షోను ఆయన ప్రారంభించారు. ఆటో షోలోని వివిధ స్టాళ్లను పరిశీలించారు.
ఒకే చోట అన్ని రకాల వాహనాలు ఉండటంతో వాహన ప్రియులకు వివిధ షోరూంలకు తిరిగే పని తగ్గి, ఎంపిక సులువవుతుందని కలెక్టర్ సూచించారు.
వాహనదారులు ఇబ్బంది పడకుండా.. కొనుగోలు అనంతర సేవలు వీలైనంత త్వరగా అందించాలన్నారు. గతంలో కేవలం ఆడంబరంగా భావించిన వాహనాలు.. నేడు అవసరంగా మారిపోయాయని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి: బంగాల్లో ఆరని 'పౌర' సెగలు.. నిరసనలు ఉద్ధృతం