నిజామాబాద్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్ రన్ పేరుతో 2కె రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ కార్తికేయ, అదనపు కలెక్టర్ లత పాల్గొని కార్యక్రమాన్ని పార్రంభించారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి నిఖిల్ సాయి చౌరస్తా వరకు ఈ రన్ సాగింది.
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఇప్పటికే అనేక రంగాల్లో సత్తా చాటారని... వారు మరింత అభివృద్ధి దిశగా దూసుకుపోవాలని వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: మహిళల భద్రత ఎవరికీ పట్టదా? మార్పు వచ్చేదెప్పుడు?