నిజామాబాద్ నగరంలో మాజీ సైనికులతో జిల్లా కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. సీనియర్ మిలిటరీ, సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మాజీ సైనికోద్యోగుల సమస్యలను తెలుసుకున్నారు.
వీరనారీలను, వికలాంగ సైనికులను సన్మానించారు. డిఫెన్స్ పెన్షన్ సెల్, బ్యాంకులు, రికార్డ్ ఆఫీసులు, ఇసీహెచ్ఎస్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒక ప్రణాళిక ప్రకారం మాజీ సైనికోద్యోగుల సమస్యలను పరిష్కరించడం, వారికి రావాల్సిన ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ విభాగాలకు చెందిన మాజీ సైనిక ఉద్యోగులు, వారి కుటుంబీకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'వారంలో రెండ్రోజులు సెలవు దినాలుగా ప్రకటించాలి'