ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌కు బుధవారం వెళ్లనున్నారు. నిజామాబాద్ నగర ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల మరణించారు. గణేశ్ గుప్తాను పరామర్శించేందుకు సీఎం వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మాక్లూర్ చేరుకుంటారు. అక్కడ జరిగే కృష్ణమూర్తి దశ దిన కర్మలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటిస్తారు.
ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు సీఎం తిరుగు పయనమవుతారు.
ఇదీ చదవండి: ఓటెందుకు సోదరా... ఆరు కొట్టింది పోదాం పదరా...!