CM KCR Vs Revanth Reddy in Kamareddy : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ప్రముఖుల మధ్య పోటీకి వేదిక అయింది. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(KCR Vs Revanthreddy)లు కామారెడ్డిలో తలపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాఫిక్‌గా మారింది. ప్రధాన పార్టీల అధ్యక్షుల మధ్య పోటీ అంటే.. ఈ సమరంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కానీ రేవంత్ రెడ్డి ఈ స్థానంలో పోటీ చేస్తారో లేదో ఇంకా స్పష్టత రావాలి.
ఇప్పటికే సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలో నిలుస్తున్నారు. నవంబర్ 9న నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రచారం, వ్యూహాలు, మేనిఫెస్టో(BRS Election Election Manifesto) వంటి అంశాలతో నియోజకవర్గ నేతలు ప్రచారంలో ఉన్నారు. కేటీఆర్ బహిరంగ సభ నిర్వహించి శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. భారీ మెజార్టీ లక్ష్యంగా కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు. కేసీఆర్ తరపున ఎమ్మెల్సీ సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌లు అన్నీ తామై పని చేస్తున్నారు. ఇప్పుడు టీపీసీసీ రేవంత్ రెడ్డి కేసీఆర్‌తో పోటీకి సై అంటున్నారన్న ప్రచారంతో కామారెడ్డి కొత్త రాజకీయ ఒరవడికి వేదికయ్యే అవకాశం కనిపిస్తోంది.
KA Paul Fires on CM KCR : కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీకి నేను సిద్ధం : కేఏ పాల్
Telangana Assembly Election 2023 : అధికార బీఆర్‌ఎస్‌కు ఎక్కడికక్కడ చెక్ పెట్టే యోచనతో ప్రతిపక్షాలు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కామారెడ్డి నుంచి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ అని భావిస్తున్నారు. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ మొదటి నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ బరిలో ఉన్నప్పటికీ తానే పోటీ చేస్తానని అనేక సార్లు షబ్బీర్ అలీ చెప్పుకొచ్చారు. తాజా రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తుండటంతో షబ్బీర్ అలీ తప్పుకోక తప్పడం లేదు.
Kamareddy Political War : షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్‌లో సర్దుబాటు చేస్తారని ప్రచారం సాగుతోంది. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సైతం తన స్థానం వదులుకోక తప్పలేదు. రెండు ప్రధాన పార్టీ అధ్యక్షుల్లో బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఖాయం కాగా.. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైతే.. కామారెడ్డిలో రాజకీయ రసవత్తరంగా మారబోతుంది. స్థానిక నేతలు, కార్యకర్తలు జోష్‌తో పని చేసే అవకాశం ఉంది. రేవంత్ కామారెడ్డిలో పోటీ చేయడం ఖాయమైతే.. అధికార, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుల మధ్య పోటీకి కామారెడ్డి కేంద్రం కానుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఇంకా వేడెక్కనుంది.
Revanth Reddy Contest from Kamareddy : 'హై కమాండ్ ఆదేశిస్తే.. కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేస్తా'