పసుపు పంటకు మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టనట్టు ఉండటం దారుణమన్నారు. అన్ని జిల్లాల్లో తిరిగి రైతుల సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పిన భట్టి... వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసి రైతుల గళం వినిపిస్తామని అంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: సాగర్ అభివృద్ధిపై బహిరంగచర్చకు సిద్ధం: మంత్రి జగదీశ్ రెడ్డి