Telangana University Registrar controversy in Nizamabad : తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ కుర్చీ కోసం వివాదం కొనసాగుతూనే ఉంది. సమస్య పరిష్కారం అయినట్టు అనిపించినా.. మళ్లీ కుర్చీ కోసం గొడవ మొదలైంది. పాలక మండలి నియమించిన వ్యక్తి, వీసీ నియమించిన వ్యక్తి మధ్య కుర్చీ కోసం వాగ్వాదానికి దారి తీసింది. ఈరోజు రిజిస్ట్రార్ ఛాంబర్లో పాలక మండలి నియమించిన యాదగిరి రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చోగా.. వీసీ నియమించిన కనకయ్య సైతం ఛాంబర్‌కు వచ్చారు. దీంతో ఇద్దరి మధ్య రిజిస్ట్రార్ పదవి కోసం వాదించుకోవాల్సి వచ్చింది. వర్సిటీలో విద్యార్థి సంఘాలు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది యాదగిరికి మద్దతుగా నిలిచారు. ఇతర ఉద్యోగులు కనకయ్యకు మద్దతుగా నిలబడ్డారు. ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. దీంతో రిజిస్ట్రార్ ఛాంబర్లో గందరగోళం నెలకొంది.
Telangana University Registrar post Godava : పాలక మండలి నిర్ణయానికి అనుగుణంగా యాదగిరి రిజిస్ట్రార్‌గా కొనసాగుతుండగా.. రెండు రోజుల కింద వీసీ రవీందర్ గుప్తా నియమించిన ఆచార్య కనకయ్య సైతం బాధ్యతలు చేపట్టారు. అయితే ఉదయమే పాలకమండలి నియమించిన ఆచార్య యాదగిరి వచ్చి రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చోగా.. తర్వాత వీసీ నియమించిన ఆచార్య కనకయ్య వచ్చారు. కుర్చీ కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులు, నాన్ టీచింగ్.. ఉద్యోగులు సైతం రెండుగా విడిపోయారు. రిజిస్ట్రార్ కుర్చీ కోసం వర్సిటీ పరిపాలనను, విద్యార్థుల భవిష్యత్‌ను గాలికొదిలేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Telangana university problem in NZB : గత సంవత్సరం కనకయ్యను వీసీ రవీందర్ గుప్తా ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా నియమించారు. పాలక మండలి అంగీకారం లేనందున నెల రోజుల్లోనే ఆ పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం యాదగిరికి ఆ కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్ ఆ బాధ్యతలను అప్పగించారు. ఆయన 40 రోజుల తరువాత అక్కడ జరుగుతున్న పరిణామాలు చూసి పదవి నుంచి తొలగిపోయారు. అనంతరం మూడో వ్యక్తి శివశంకర్‌ను ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్‌గా రవీందర్ గుప్తా నియమించారు. మూడు నెలల్లో పాలక మండలి ఆమోదం తెలపలేనందున.. ఆయన కూడా ఆ పదవి నుంచి నిష్క్రమించారు. మళ్లీ ఈ పదవికి అకాడమిక్ సెల్ డైరెక్టర్ విద్యావర్దినిని ఉపకులపతి ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా నియమించారు. ఈమె నియామకాన్ని ఈసీ వ్యతిరేకించినందున ఆమె పదవి నుంచి దిగిపోయింది. ఐదోసారి ఓయూ ప్రొఫెసర్ నిర్మలా దేవిని రిజిస్ట్రార్‌గా నియమించారు. ఇప్పటి వరకు ఐదుగురు రిజిస్ట్రార్లను మార్పు చేశారు. మళ్లీ ఇప్పుడు కుర్చీల ఆట మొదలైంది.
ఇవీ చదవండి :