నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్(బి) గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. తాళం వేసిన రెండు ఇళ్ల నుంచి సుమారు 37 తులాల బంగారం, రూ. 57 వేల నగదు కాజేశారు దుండగులు.
వన్నెల్(బీ) గ్రామంలో సంతోష్, గడ్డం నర్సయ్య అనే రైతులు పొలానికి వెళ్లారు. పసుపు తవ్వేందుకు ఇంటికి తాళం వేసి కుటుంబమంతా వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించిన దొంగలు సంతోష్ ఇంట్లో బీరువా తాళం పగులగొట్టి.. 37 తులాల బంగారు నగలు, రూ.17 వేలు నగదు ఎత్తుకెళ్లారు. ఆ ఇంటి పక్కనే ఉన్న గడ్డం నర్సయ్య ఇంట్లోకి సైతం చోరబడి రూ.40 వేలు నగదు కాజేశారు. మిట్ట మధ్యాహ్నం చోరీ జరగడం స్థానికులను ఆందోళకు గురిచేసింది.
బాధితుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్‌టీంతో వేలిముద్రలు సేకరించారు.
ఇవీచూడండి: ప్రాణం పోసే అంబులెన్సే.. ప్రాణం తీసింది!