ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికై సెప్టెంబర్ 4న ఛలో డీఎంహెచ్ఓ కార్యాలయం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు ఉదయం 10 గంటలకు కార్యాలయం వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చారు.
కరోనా కాలంలో నిర్విరామ కృషి చేస్తున్న ఆశావర్కర్లను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. అందువల్ల తమ సమస్యల పరిష్కారం కోసం, తమ డిమాండ్ల సాధనకై పోరాటం చేయాలని పిలుపునిచ్చామని జిల్లా కార్యదర్శి నూర్జహాన్ స్పష్టం చేశారు.