నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం దుస్గమ్ గ్రామానికి చెందిన సాయి కుమార్ (21), మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన అరుణ్ (24) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. మద్యానికి బానిసలైన వారు కష్టం లేకుండా డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్‌ను నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడి ప్రాంతంలో దొంగతనం చేశారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను ఎంచుకొని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు.
నగరంలోని 2, 3, 5వ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. వేల్పూరు మండల పరిధిలోని పచ్చలనడుకుడ గ్రామంలో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. తర్వాత రెండు సెల్ఫోన్లు కూడా చోరీ చేశారు. నిందితులు మరో చైన్ స్నాచింగ్ పాల్పడుతుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి బంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: Software Engineer: కొలువు వదిలేసి.. పొలం బాటపట్టి!