ETV Bharat / state

నేడు నిజామాబాద్​ బంద్

ఎర్రజొన్న పంటను నేరుగా కొనుగోలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కేసీఆర్​ పెడచెవిన పెట్టారని టీపీసీసీ అధికార ప్రతినిధి చంద్రమోహన్​ అన్నారు.

టీపీసీసీ అధికార ప్రతినిధి
author img

By

Published : Feb 28, 2019, 1:23 PM IST

20 రోజులుగా పసుపు, ఎర్రజొన్న రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి చంద్రమోహన్​ మండిపడ్డారు. రైతు సంఘ నేతల అరెస్టుకు వ్యతిరేకంగా నిజామాబాద్​ రూరల్​, ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పిలుపుతో బంద్ కొనసాగుతోందన్నారు. వ్యాపారస్తులు, ప్రైవేటు పాఠశాలలు, పెట్రోల్​ బంక్​లు స్వచ్ఛందంగా ఈ బంద్​లో పాల్గొంటున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.

బంద్​ ప్రకటనతో నిర్మానుష్యంగా ఉన్న రోడ్లు

ఇవీ చదవండి:మద్దతు ధర ఏదీ..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.