ETV Bharat / state

బీఆర్‌ఎస్‌ గెలిస్తే బోథ్‌ నియోజకవర్గంలో కుట్టి రిజర్వాయర్‌ను నిర్మిస్తా : కేసీఆర్‌ - బోథ్‌ బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ

BRS Party President KCR Participate BRS Praja Ashirvada Sabha at Boath : ఈ శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవగానే నెల రోజుల్లో బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేస్తానని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మాటిచ్చారు. పార్టీ చేసిన అభివృద్ధిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నిజామాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు.

BRS Party President KCR
BRS Praja Ashirvada Sabha at Boath
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2023, 4:31 PM IST

Updated : Nov 16, 2023, 8:17 PM IST

BRS Party President KCR Participate BRS Praja Ashirvada Sabha at Boath : బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని ఊరూవాడ వెళ్లి కార్యకర్తలు ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌(CM KCR) సూచించారు. ఆనాడు తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ చచ్చుడో అన్నట్లు పోరాటం చేశానని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌(BRS Party) పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని మరోసారి తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని.. ప్రసంగించారు.

ఈసారి ఎన్నికల్లో బీఆర్​ఎస్ గెలవగానే నెల రోజుల్లో బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేస్తానని సీఎం కేసీఆర్‌ మాట ఇచ్చారు. రైతులకు 24 గంటల కరెంటు కన్నా 3 గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అంటున్నారని విమర్శించారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల సంక్షేమం కోసమే రైతు బంధు, రైతు బీమా(Rythu Bima) అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రచార హోరు

BRS Public Meeting at Boath : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి(Dharani Portal)ని బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అంటున్నారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇప్పుడు ధరణిని తీసేస్తే రైతు బంధు, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని ఓటర్లను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వస్తే కచ్చితంగా దళారీల రాజ్యం వస్తోందని హెచ్చరించారు. ఈ పోర్టల్‌ వల్ల రైతులు గడప దాటకుండానే ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని హర్షించారు. అలాగే బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రంలో పోడు భూముల పట్టాలను పంపిణీ చేశామని వివరించారు.

"ప్రజలు ఆలోచించి అభ్యర్థులకు ఓటు వేయాలి. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. అందుకు ప్రజలకు ఉన్న ఏకైక ఆయుధం ఓటు. 1964 ఉద్యమంలో 400 మందిని కాంగ్రెస్‌ కాల్చి చంపింది. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత చెరువుల్లో పూడిక తీసి.. భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేశాం. కానీ కాంగ్రెస్‌ 58 ఏళ్ల పాలనలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. వారి పాలనలో కరెంటు, నీటి కష్టాలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటిపై పన్నును రద్దు చేశామని" సీఎం కేసీఆర్‌ తెలిపారు.

"ఒకమాట మీకు చెప్పాలి.. బీజేపీ పదేళ్లు అయింది పాలించబడి.. కాంగ్రెస్‌ ఏమో మనల్ని ఆంధ్రాలో కలిపి గోస పట్టించింది. బీజేపీ దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలు పడితే ఒక్కటంటే ఒకటి కూడా తెలంగాణకు కేటాయించలేదు. నవోదయ పాఠశాలలు, గిరిజన బిడ్డలు చట్టం ఉంది పార్లమెంటులో ప్రతి కొత్త జిల్లాకు ఒకటి ఇవ్వాలని. మనం 33 జిల్లాలు అయ్యాయి.. మోదీకి 100 ఉత్తరాలు రాశాను. ఈరోజు బీజేపీ ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది. - కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ అధినేత

BRS Election Campaign at Nizamabad : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి పదేళ్లు అయిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని దుయ్యబట్టారు. కేంద్రం ఒక్క సైనిక పాఠశాలను కూడా రాష్ట్రానికి కేటాయించలేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిస్తే బోథ్‌ నియోజకవర్గంలో కుట్టి రిజర్వాయర్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో పింఛను రూ.200.. అలాంటి పింఛన్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చి రూ.2000 చేసిందని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ గెలిస్తే బోథ్‌ నియోజకవర్గంలో కుట్టి రిజర్వాయర్‌ను నిర్మిస్తా

పొలిటికల్ మ్యాజిక్‌- అభ్యర్థులు వారే గుర్తులే మారే

యువతే టార్గెట్‌గా ప్రచారం ట్రెండ్‌ ఫాలో అవుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు

Last Updated : Nov 16, 2023, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.