ETV Bharat / state

BRS MLC Kavitha Fires on Bandi Sanjay : 'కరెంటు తీగలు పట్టుకొని చూడండి.. వస్తుందో లేదో తెలుస్తుంది'

BRS MLC Kavitha Fires on Bandi Sanjay : బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. అర్వింద్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కోరుట్ల పారిపోతున్నారని.. తాను మాత్రం వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ లేదని పార్లమెంటులో ప్రస్తావించిన బండి సంజయ్.. హైదరాబాద్​లోని బీజేపీ కార్యాలయం వద్ద కరెంటు తీగలు పట్టుకొని చూడాలని ఎద్దేవా చేశారు.

BRS MLC Kavitha
MLC Kavitha
author img

By

Published : Aug 11, 2023, 8:16 AM IST

BRS MLC Kavitha Fires on BJP and Congress కరెంటు తీగలు పట్టుకొని చూడండి.. వస్తుందో లేదో తెలుస్తుంది

BRS MLC Kavitha Fires on Bandi Sanjay : రాష్ట్రానికి బీజేపీ ఒరగబెట్టిందేం లేదంటూ బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పార్లమెంట్‌ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెల్లదీస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సిన ప్రజాప్రతినిధులు మాటలతో కాలయాపనా చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తాను నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేసి గెలుస్తానని కవిత పేర్కొన్నారు. ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కోరుట్ల పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. గురువారం బీఆర్​ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు గణేశ్‌ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్‌, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌లతో కలిసి మాట్లాడిన కవిత.. బీజేపీ, కాంగ్రెస్​లను ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

MLC Kavitha fires on MP Arvind : నిజామాబాద్ తన అత్తగారి ఊరని.. నిజామాబాద్ జిల్లా దశమార్చబోతున్న ఐటీ హబ్(Nizamabad IT Hub)​లో ఉద్యోగాల కల్పనపై ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడినవన్నీ అబద్దాలేననీ, సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరే స్థాయి ఆయనది కాదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నిజామాబాద్ ఐటీ టవర్​లో మొదటి రోజే 280 మందికి ఉద్యోగాలు వచ్చాయని.. అది చూసి ఉలిక్కిపడ్డ కాంగ్రెస్ నేతలు మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ కూడా అక్కసు వెళ్లగక్కారన్నారు. నిజామాబాద్​లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదని.. ఐదు సీట్లనూ తామే గెలుస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు.

Bandi Sanjay Fires on Telangana Government : 'తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా'

BRS MLC Kavitha Comments on Bandi Sanjay : పార్లమెంటులో బండి సంజయ్(Bandi Sanjay) విపరీతమైన అబద్దాలు చెప్పారని బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంటు లేదన్న బండి సంజయ్.. బీజేపీ కార్యాలయం వద్ద విద్యుత్ తీగలు పట్టుకొని చూడాలని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో బండి సంజయ్ తమ నాయకుడిని వ్యకిగతంగా తిట్టడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్​కు భయపడి బీజేపీ, కాంగ్రెస్.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని కవిత ధ్వజమెత్తారు. తమ పార్టీ కాంగ్రెస్​తో కలిసిందని బీజేపీ అంటుందని.. బీజేపీతో కలిసిందని కాంగ్రెస్ చెబుతుందని.. తమకు ఈ అనుభవం కొత్త కాదని స్పష్టం చేశారు. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై.. సిద్ధాంతాలను పక్కనబెట్టి కేసీఆర్​పై వ్యక్తిగత ద్వేషంతో కలిసి పనిచేశాయని కవిత తెలిపారు.

Kavitha to contest from Nizamabad Lok Sabha Constituency : ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) బీఆర్​ఎస్​కు ప్రధాన పోటీ కాంగ్రెస్ తోనేనన్న ఎమ్మెల్సీ కవిత... అయితే రెండు పార్టీల మధ్య సుమారు 20శాతం ఓట్ల తేడా ఉంటుందన్నారు. తమకు ప్రశాంత్ కిషోర్ అవసరం లేదని, కేసీఆర్ చాలని అన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంపై సుప్రీం కోర్టు తీర్పును పక్కనబెట్టడానికి కేంద్రం బిల్లును తీసుకోచ్చిందన్న కవిత.. ఈసీ కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని ఆమె తప్పుబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనుకున్నవారే ఎన్నికల కమిషనర్లు అవుతారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయా అనే ప్రశ్న తలెత్తుతుందని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ తీసుకొచ్చే అంశమన్నారు.

BRS on Telangana Assembly Elections 2023 : విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా BRS దూకుడు.. హ్యాట్రిక్ దిశగా కేసీఆర్ కీలక నిర్ణయాలు

MLC Kavitha Challenge to MP Aravind : ఎంపీ అర్వింద్​కు కవిత 24 గంటల డెడ్​లైన్

BRS protest over Revanth comments : 'ధరణి పోవాలే.. దళారులు రావాలే.. ఇదే కాంగ్రెస్ అభిమతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.