నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు హాజరయ్యారు. బిడ్డకు తల్లి పాలు అమృతంతో సమానమని, శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు తల్లిపాలు కీలకమన్నారు. పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పడితే తల్లితో పాటు బిడ్డకు కూడా ఆరోగ్యమే అన్నారు. అపోహాలతో కొందరు బిడ్డలకు పాలు పట్టే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు. ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణ గవర్నర్ను కలిసిన సీఎం జగన్