నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ జర్నలిస్టుకాలనీ సమీపంలో ఐదు రోజుల క్రితం పవర్ శ్రీకాంత్ అనే ఎనిమిది నెలల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మామిడిపల్లికి చెందిన లక్ష్మి చిత్తుకాగితాలు, ఇనుప సామగ్రి సేకరిస్తూ ఈనెల 3న జర్నలిస్టు కాలనీ కెనాల్ కట్ట ప్రాంతానికి వచ్చి చెట్టు కింద పడుకుంది. లేచి చూసే సరికి బాబు కనిపిచకపోవటంతో ఆమె కంగారుపడింది. చుట్టపక్కల ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని బాబు ఆచూకీ కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.
ఇవీ చూడండి: 'రంజాన్ తర్వాత భారత్కు వీరయ్య'