ప్రతి ఏటా వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు పుష్కలంగా పండాలని గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం (వై) గ్రామంలో గ్రామస్తులు బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాధి సోకకుండా చూడాలని అమ్మవారిని వేడుకుని, బోనాలు సమర్పించారు. కానీ విజృంభిస్తున్న కేసుల దృష్ట్యా, పలు చోట్ల నిబంధనల ఉల్లంఘన ఆందోళనకరంగా మారుతోంది. గ్రామాల్లో ప్రజలకు వ్యాధి పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ఇది చదవండి: కరోనా వల్ల గుండె సమస్యలు తలెత్తుతాయా?