నిజామాబాద్ జిల్లా బోధన్‌లో లాక్డౌన్ నిబంధనలు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని దుకాణ యజమానులకు మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. మాస్కులు ధరించకుండా అమ్మకాలు చేపట్టిన దుకాణదారులకు రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానాలు విధించారు.
ప్రతీ ఒక్కరు నిబంధనలు తప్పకుండా నియమాలు పాటించాలని అధికారులు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.