ETV Bharat / state

Black Fungus : నిజామాబాద్​లో బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తికి చికిత్స - black fungus cases in nizamabad

బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తికి నిజామాబాద్ జీజీహెచ్​లో శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. మరో నలుగురు బాధితులు ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

black fungus
నిజామాబాద్​లో బ్లాక్ ఫంగస్, నిజామాబాద్​లో బ్లాక్ ఫంగస్ కేసులు, నిజామాబాద్​లో బ్లాక్ ఫంగస్ మరణాలు
author img

By

Published : May 31, 2021, 6:34 PM IST

బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తికి నిజామాబాద్ జీజీహెచ్​లో శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్​పేట్​కు చెందిన వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకగా.. హైదరాబాద్​లో చికిత్స తీసుకున్నారు. ఖర్చు పెట్టే స్తోమత లేకపోవడం వల్ల తిరిగి ఇంటికి వెళ్లారు. ఇంకా కొంత ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఆదివారం రోజున జీజీహెచ్​లో చేరారు. అతనికి సోమవారం రోజున శస్త్ర చికిత్స చేసినట్లు వివరించారు.

మరో నలుగురు బ్లాక్ ఫంగస్​తో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారని డాక్టర్ తెలిపారు. ఆదివారం రోజున బ్లాక్ ఫంగస్​తో మృతి చెందిన బాధితురాలి గురించి స్పందిస్తూ.. సరైన సమయంలో ఆమె ఆస్పత్రిలో చేరలేదని.. పరిస్థితి విషమించిన తర్వాత చేరడం వల్ల ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.