నిజామాబాద్ కార్పొరేషన్ పునర్విభజన అధికారపార్టీకి అనుకూలంగా, అస్తవ్యస్తంగా విభజించారని భాజపా నాయకుడు బస్వా లక్ష్మీ నరసయ్య ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించడం చాలా శుభపరిణామం అన్నారు. ఎన్నికలు త్వరగా నిర్వహించి తెరాస గందరగోళం సృష్టించాలని ప్రయత్నించిందన్నారు. ఓటర్ల జాబితా కూడా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. సవరించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: పక్కదారి పడుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ