నిజామాబాద్‌లోని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దని జిల్లా పాలనాధికారికి భాజపా కార్యకర్తలు వినతి పత్రం సమర్పించారు. ప్రజా ఆస్తులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని నగర భాజపా అధ్యక్షుడు సుధాకర్ రావు ఆరోపించారు. ప్రజాపాలన చేయమంటే తెరాస ఆస్తులు కూడగట్టుకోడానికి ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని నగర శివారులోకి తరలించి... పార్టీ కార్యాలయాన్ని మాత్రం నగరం నడిబొడ్డున నిర్మించడమేంటని ప్రశ్నించారు. భవన నిర్మాణాన్ని ఆపకుంటే ఆందోళనలు చేపడతామని భాజపా కార్యకర్తలు హెచ్చరించారు.
ఇవీ చూడండి: హైకోర్టు ప్రధానన్యాయమూర్తికి పోచంపల్లి లేఖ