కరోనా ప్రాణాలు కబళిస్తున్నా.. గుండె ధైర్యం కోల్పోకుండా ప్రజలకు సేవ చేసిన వారిలో పోలీసులు ఒకరు. డాక్టర్లు వైద్యం అందించి ప్రాణాలు కాపాడితే.. పోలీసులు వైరస్ వ్యాపించకుండా లాక్డౌన్ సమయంలో ప్రజలను కట్టడి చేసి విధులు నిర్వహించారు. ఇప్పుడు లాక్డౌన్ సడలించడం వల్ల స్టేషన్లోనే విధులు నిర్వర్తిస్తూ.. కరోనా దరికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ల దగ్గర ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ, గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణలో బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టడి చేస్తున్నారు. విధుల్లో ఉండే పోలీసులను తప్ప.. బయటి వ్యక్తులను స్టేషన్లోకి అనుమతించడం లేదు. బోధన్ గ్రామీణ పోలీస్ స్టేషన్ బయట శానిటైజర్ ఏర్పాటు చేసి చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో సైతం కిటికీల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.
ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం