భారత్ బంద్‌కు మద్దతునిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ డిపో-1 ఎదుట వామపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
డిపో ఎదుట నాయకులు ధర్నాకు దిగడంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు డిపో వద్దకు చేరుకొని బందోబస్తును నిర్వహించారు. నిజామాబాద్ నగర వ్యాప్తంగా భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: అన్నదాతలకు మద్దతుగా బంద్... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు