ETV Bharat / state

'భగత్​సింగ్ ఆశయాల కోసం నిరంతరం పోరాడుతాం'

సంపూర్ణ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ తన ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడారని నిజామాబాద్ జిల్లా ఎస్​ఎఫ్​ఐ అధ్యక్షుడు అనిల్ అన్నారు. భగత్​సింగ్ కలలుగన్న లక్ష్యాల కోసం నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు. కుల, మత రహిత సమాజం స్థాపించాలనే లక్ష్యంతో సాధించుకున్న దేశంలో మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన 113వ జయంతిని పురస్కరించుకొని భగత్​సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

bhagat singh  birth anniversary by sfi in nizamabad
'భగత్​సింగ్ ఆశయాల కోసం నిరంతరం పోరాడుతాం'
author img

By

Published : Sep 28, 2020, 2:35 PM IST

భగత్​సింగ్ ఆశయాలు, ఆయన కలలుగన్న లక్ష్యాల కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్ తెలిపారు. భగత్​సింగ్ తన ప్రాణాలను లెక్కచేయకుండా సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. ఆయన 113వ జయంతిని పురస్కరించుకొని ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భగత్​సింగ్ చౌరస్తాలోని షహిద్ భగత్​సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం

కుల, మత రహిత సమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో బ్రిటిష్ వారితో పోరాడి సాధించుకున్న ఈ దేశంలో ప్రస్తుతం మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు మారుతి, సతీష్​లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: భగత్​ సింగ్​కు మోదీ, షా నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.