చెరువులు, కుంటలపై గంగపుత్రులకే తొలి హక్కు ఉందని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేశారు. గంగపుత్రులు తమ బతుకుదెరువుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కుల సంఘాలతో ఎమ్మెల్సీ కవితతో కలిసి ఆయన సమావేశమయ్యారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 6ను రద్దు చేయాలని జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పల్లికొండ అన్నయ్య అన్నారు. తాము ఉన్న చోట ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర కులాలకు అవకాశం ఇవ్వకూడదని... అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా సమక్షంలో మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సమయంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ మాటలను గంగుల గుర్తు చేశారు.
గంగపుత్రుల సమస్యలను వెంటనే తీర్చితే తెరాస ప్రభుత్వానికి రుణ పడి ఉంటామని అన్నయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర అసోసియేటెడ్ అధ్యక్షుడు వినోద్, ప్రధాన కార్యదర్శి మాకు రవి, స్థానిక అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'టూల్కిట్' అరెస్టులపై రాజకీయ రగడ