నిజామాబాద్ కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో మహాత్మ బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బసవేశ్వర చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు.
సాంస్కృతిక శాఖ, కలెక్టరేట్ అధికారులు సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది, తహసీల్దార్ ప్రశాంత్, రమణ్ రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొని మహాత్మునికి నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి: రాగల మూడు రోజులపాటు వర్షాలు..!