ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ.. సమష్టిగా కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్యశాఖ, ఇతర స్వచ్ఛంద సంస్థలతో పాటు జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా కేంద్ర జనరల్ దవాఖాన వరకు కొనసాగింది. వైద్యారోగ్యశాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయడం వల్ల జిల్లాలో ఎయిడ్స్ కేసులు తగ్గాయని కలెక్టర్ అన్నారు. వ్యాధి బారిన పడ్డ వారిని వివక్ష చూపకుండా ఆదరించాలన్నారు. వారికి మానసిక స్థెర్యాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎయిడ్స్ నివారణకు కృషి చేస్తున్న వైద్యసిబ్బంది, స్వచ్ఛంద సంస్థల వారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి : అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన... మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు