ప్రతి ఒక్క మహిళ తడి, పొడి చెత్తలపై సమరం చేయాల్సిన సమయం అసన్నమైనదని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ పేర్కొన్నారు.
నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో తడిచెత్త , పొడి చెత్తపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన.. వివిధ పనుల కారణంగా ఉద్భవించే తడి చెత్తను, పొడి చెత్తను వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకు అందిచాలని తెలిపారు. రోడ్లపైన, డ్రైనేజీలలో వేయకూడదని సూచించారు. అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ సూచనలను విధిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, MHO డా. శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ షోయబ్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఒక్కో చెరుకు గడ 20 అడుగుల ఎత్తు- సీక్రెట్ ఇదే