నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం దుబ్బ తండాకు చెందిన వ్యవసాయ కూలీలు వేరే ఊరికి కూలీకి వెళ్లడానికి కిరాయికి ఆటో మాట్లాడుకున్నారు. బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామానికి కూలీ పనుల నిమిత్తం వెళ్తుండగా.. ఎడవల్లి మండల కేంద్రం సమీపంలో ఒక్కసారిగా ఆటో అదుపు తప్పి తలకిందులయింది. ఆటోలో ఉన్న 12 మందికి గాయాల పాలయ్యారు. ఐదుగుకు మహిళలకు తీవ్ర గాయాలు కాగా.. వారికి స్థానిక ప్రైవేట్ క్లినిక్‌లో చికిత్స చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇదీ చదవండి: దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్