నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. రూ.8500 రూపాయల వేతనాన్ని వెంటనే పది వేల రూపాయల జీత భత్యంగా అందజేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పనికి తగిన వేతనమిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కారని ఆందోళన వ్యక్తం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తెరాస ఆ హామీనే మర్చిపోయిందని వాపోయారు. ప్రతి పనిలో తమనే వినియోగిస్తారని..అలాంటప్పుడు సమాన వేతనం ఎందుకివ్వరని ప్రశ్నించారు. తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మాకు పనికి సమాన వేతనం ఎందుకివ్వరూ ? - EQUAL WAGES FOR EQUAL WORK
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఆశ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేశారు. ఈరోజు అసెంబ్లీ ముట్టడిలో భాగంగా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.