ETV Bharat / state

BJP Jan Sampark Abhiyan Program : 'కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పేరుతో కేసీఆర్ దోచుకున్నారు' - Arvind fires on KCR

Jan Sampark Abhiyan Program : కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ దోచుకున్నారని ఎంపీ అర్వింద్ దుయ్యబట్టారు. మరోవైపు రాష్ట్రంలో మరుగుదొడ్లను నిర్మించకుండానే.. పూర్తి చేసినట్టు చూపి ఎమ్మెల్యేలు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

arvind
arvind
author img

By

Published : Jun 4, 2023, 4:59 PM IST

Maha Jan Sampark Abhiyan program in Nizamabad : కరోనా సమయంలో వేగంగా వ్యాక్సిన్ కనుగొనడంలో.. ప్రపంచంలోనే భారత్ మొదటిదని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. అమెరికా కంటే అతివేగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశంలోనే జరిగిందని వివరించారు. ఈ క్రమంలోనే 3 కోట్ల 50 లక్షల ఇల్లు పేదలకు మోదీ సర్కార్ కట్టించి ఇచ్చిందని తెలిపారు. కానీ రాష్ట్రంలో పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తామని వాగ్దానం చేసిన కేసీఆర్.. గెలిచిన తర్వాత దానిని తుంగలో తొక్కారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Arvind Comments on BRS Government : ఇందులో భాగంగానే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సాయంతో తొమ్మిదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధి.. అంతకు ముందు 60 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని అర్వింద్ వివరించారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల 72 లక్షల మరుగుదొడ్లను బీజేపీ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. కానీ రాష్ట్రంలో మరుగుదొడ్లను నిర్మించకుండానే.. పూర్తి చేసినట్టు చూపి ఎమ్మెల్యేలు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని అర్వింద్ విమర్శించారు.

  • BJP Jan Sampark Abhiyan in TS : 'జన్ సంపర్క్ అభియాన్'​.. అస్త్రంగా రాష్ట్ర బీజేపీ వ్యూహం

మరోవైపు కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పేరుతో సీఎం కేసీఆర్ దోచుకున్నారని అర్వింద్ ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ వల్ల ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. దీని కింద 10 కోట్ల 74 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. ప్రతి ఏకరానికి రూ.35,000 వివిధ రూపాల్లో ప్రధాని మోదీ ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిందని అర్వింద్ వివరించారు.

దేశంలో 2014 వరకు 74 ఎయిర్‌పోర్టులు ఉంటే.. కేంద్రం గత 9 సంవత్సరాలలోనే మరో 74 నిర్మించినట్లు అర్వింద్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. వచ్చే 4 ఏళ్లలో 900 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు వస్తాయని అన్నారు. మరోవైపు వేల కోట్ల బడ్జెట్‌తో రైల్వేస్టేషన్ల సుందరీకరణ జరుగుతోందని వెల్లడించారు. 370 ఆర్టికల్ రద్దు వల్ల కాశ్మీర్‌లో అల్లర్లు, టెర్రరిజం తగ్గి.. అభివృద్ధి పెరిగిందని తెలిపారు. మూడోసారి కూడా బీజేపీని గెలిపిస్తే. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతుందని అర్వింద్ వ్యాఖ్యానించారు.

"అమెరికా కంటే అతివేగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశంలోనే జరిగింది. 3 కోట్ల 50 లక్షల ఇల్లు పేదలకు మోదీ సర్కార్ కట్టించింది. పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తామని వాగ్దానం చేసిన కేసీఆర్.. గెలిచిన తర్వాత దానిని తుంగలో తొక్కారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల 72 లక్షల మరుగుదొడ్లను బీజేపీ ప్రభుత్వం నిర్మించింది. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పేరుతో సీఎం కేసీఆర్ దోచుకున్నారు. ఆయుష్మాన్ భారత్ వల్ల ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం." - అర్వింద్, ఎంపీ

కాళేశ్వరం మిషన్‌ భగీరథ పేరుతో కేసీఆర్ దోచుకున్నారు

ఇవీ చదవండి : Dharmapuri Arvind: 'రాష్ట్రమంతా అకాల వర్షాలు.. సీఎం, వ్యవసాయ మంత్రి మాత్రం ఫాంహౌస్​లో'

పసుపు బోర్డు ఫ్లెక్సీలపై అర్వింద్​ రియాక్షన్​ ఇదే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.